Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె షబీర్ పాషా
నవతెలంగాణ-మణుగూరు
రూ.13 వేలకోట్లతో ఏడున్నర లక్షల ఎకరాలకు నిరంధించే సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణాలు కమ్యూనిస్టుల పోరాటల ఫలితమేనని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే. సాబీర్ పాషా అన్నారు. ఆదివారం సీపీఐ పోరు యాత్రలో భాగంగా కిన్నెర కళ్యాణ మండపంలో విలేకరులతో మాట్లాడుతూ భారీ ప్రాజెక్టుల కారణంగా జిల్లాలో లక్ష 30 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుందన్నారు. జిల్లా సస్యశ్యామలం కావాలంటే పగళ్లపల్లి రిజర్వాయర్ నిర్మించాలని పినపాక నియోజకవర్గంలో పులుసుబంత ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని, ఇల్లందు, రోళ్ళపాడు ప్రాజెక్టు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలన్నారు. గోదావరి కరకట్ట నిర్మాణం కారణంగా గోదావరి పరాహక ప్రాంతంలోని భూములకు నీటి వనరులు కరువైతాయన్నారు. భూములకు నిరంధించేందుకు కంటిన్యూనిటీ కాలువలు, లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూ నిర్వాసితుల సంఖ్య రోజుకు పెరుగుతుందన్నారు. సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ బ్యారేజ్ బిటిపిఎస్, సింగరేణి ఉపరితల గనులు వలన రైల్వే నిర్మాణంలో భూనిర్వాస్తులు తదితర భూనిర్వాస్తులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులందరికీ దళిత బంధం అందించాలంటే మానేశారు నిర్మాణానికి స్థలం ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.అయోధ్య చారి, నాయకులు మున్నా లక్ష్మణ్ కుమారి, జంగం మోహన్ రావు, డీ.సుధాకర్, సర్వర్, తోట రమేష్ తదితరులు పాల్గొన్నారు.