Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నివాళులర్పించిన సీపీఐ(ఎం),
- కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు
నవతెలంగాణ-ముదిగొండ
భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు సిపిఐ(ఎం) మండల కార్యదర్శి బట్టు పురుషోత్తంకు తండ్రి బట్టు వీరస్వామి (96) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, రాష్ట్ర నాయకులు పొన్నం వెంకటేశ్వరావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా నాయకులు బండి రమేష్, బండి పద్మ, టిపిసిసి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ రాయల నాగేశ్వరరావు, బిఎస్పీ జిల్లా ఇన్చార్జి పిసి వీరస్వామి, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల్ల వెంకటేశ్వరరావు, ముదిగొండ సొసైటీ చైర్మన్ తుపాకుల యలగొండస్వామి వీరస్వామి మృతదేహాన్ని సందర్శించి పుష్పగుచ్చాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వీరస్వామి మృతికి సంతాపాన్ని వ్యక్తం చేస్తే కుటుంబసభ్యులకు వారు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుడు వీరస్వామికు ఐదుగురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు బట్టు పురుషోత్తం గ్రామ మాజీ సర్పంచ్ గా గతంలో పని చేశారు. ప్రస్తుతం సొసైటీ వైస్ చైర్మన్ గా,సిపిఐ (ఎం) మండల కార్యదర్శిగా కొనసాగుతూ రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఐదుగురు కూతుర్లలో మూడో కూతురు చింతలచెరువు లక్ష్మి దిశా జిల్లా కమిటీ సభ్యురాలుగా టీఆర్ఎస్ పార్టీలో మహిళా నేతగా ఎదిగారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం) మధిర నియోజకవర్గ ఇన్చార్జ్ చింతలచెరువు కోటేశ్వరరావు, నాయకులు రాయల వెంకటేశ్వర్లు మరలపాటి వెంకటేశ్వరరావు, మందరపు వెంకన్న టీఎస్ కళ్యాణ్, వేల్పుల భద్రయ్య, ఇరుగు నాగేశ్వరరావు, కట్టకూరి ఉపేందర్, సొసైటీ డైరెక్టర్ రాయల శ్రీనివాసరావు, చింతకాని, బోనకల్లు మండల కార్యదర్శులు మడుపల్లి గోపాలరావు, దొండపాటి నాగేశ్వరరావు, ఐద్వా మండల అధ్యక్ష కార్యదర్శి మందరపు పద్మ, పయావుల ప్రభావతి నవతెలంగాణ ఖమ్మం రూరల్ డివిజన్ ఇన్చార్జి గుమ్మడి నరసయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీగడ శ్రీనివాస్ యాదవ్, ఖమ్మం నగర కార్పొరేటర్ కూరాకుల వల్లరాజు,నాయకులు బంక మల్లయ్య, వెంకటాపురం, ముదిగొండ గ్రామసర్పంచ్ లు కోటి అనంతరాములు, మందరపు లక్ష్మీవెంకన్న, రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శి కందుల భాస్కరరావు, కోలేటి ఉపేందర్, చిరుమర్రి ఎంపీటీసీ సభ్యురాలు కోలేటి అరుణ, డీవైఎఫ్ఐ మండల అధ్యక్షకార్యదర్శి బట్టు రాజు, మెట్టెల సతీష్, ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు పురిమెట్ల సాయిరాం బంధుమిత్రులు, వీరస్వామి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు అంతమ యాత్రలో అధికసంఖ్యలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.