Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆహ్వాన పత్రికను గ్రామ ప్రజలకు అందజేసిన సండ్ర
- 24న మంత్రి హరీష్ రావు రాక
నవతెలంగాణ-కల్లూరు
ఈనెల 19న చెన్నూరులో జరిగే ఆత్మీయ సమ్మేళనం కుటుంబ సమేతంగా పాల్గొని జయప్రదం చేయాలని సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకటవీరయ్య స్వయంగా ప్రజలకు ఆహ్వాన పత్రికను అందజేశారు. మండల పరిధిలోని ముచ్చవరం గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరిస్తూ ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా చేశారు. కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో జరిగిన ఘటన చాలా భాదకరమని, మరణించిన కుటుంబాలు గాయపడిన కుటుంబాల వారికి ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదేవిధంగా ఈ నెల 24న కల్లూరులో నిర్వహించు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరు అవుతారని ఆహ్వానం పలుకుతూ మండల కేంద్రంలోని భారీ మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించాలని, అనంతరం కల్లూరులో నూతనంగా నిర్మించబోతున్న ప్రభుత్వ వైద్యశాలకు మంత్రి హరీష్ రావు భూమి పూజ చేయనున్నారని, అనంతరం ఆయన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొంటారని సండ్ర తెలిపారు. అందులో భాగంగా కల్లూరు, తల్లాడ మండలాల్లో ఉన్న ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరికి ఇఫ్తార్ విందు ఏర్పాట్లు చేయాలని మండల నాయకులకు ఆయన సూచించారు. మంత్ర హరీష్ రావుతో పాటు జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజరు కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు పాలెపు రామారావు, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్, కల్లూరు సోసైటీ అధ్యక్షులు బోబోలు లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, ముచవరం గ్రామ సర్పంచ్ గంగవరపు వెంకటేశ్వరావు (శ్రీనివాసరావు), గ్రామ ఉపాధ్యక్షులు సరాబు వెంకటేశ్వరావు, యర్రబోయినపల్లి గ్రామ సర్పంచ్ సింగిశాల పద్మ, ఖమ్మం జిల్లా రేషన్ డీలర్ల సంఘం ఉపాధ్యక్షులు, మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు సింగిశాల ప్రసాద్, రైతు సమన్వయ సమితి సభ్యులు లక్కినేని రఘు, పసుమర్తి చందర్రావు, ఏఎమ్సి వైస్ చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరరావు, యువజన విభాగం అధ్యక్షులు పెడకంటి రామకృష్ణ, సర్పంచులు నందిగామ ప్రసాద్, రావి సూర్యనారాయణ, మాన్సింగ్, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ శాఖ ఖమ్మంపాటి రమేష్, రచబండ్ల నాగేశ్వరరావు, సిహెచ్ కిరణ్, మండల ముఖ్య నాయకులు, ముచవరం బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సాధం రాజయ్య, ఎంపీటీసీ వైకుంఠ పద్మావతి, వార్డు సభ్యులు రామిశెట్టి శ్రీనివాసరావు, ఇనపనూరి అనసూయ, మేడపోతులు గోపలకృష్ణ, దిగ్గిరాల కృష్ణయ్య, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.