Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదగా అవార్డు అందుకున్న కలెక్టర్
నవతెలంగాణ-పాల్వంచ
జాతీయ స్థాయిలో వివిధ విభాగాలలో నిర్వహించిన పోటీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌతంపూర్ పంచాయతీ ఆరోగ్య పంచాయతీ విభాగంలో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. సోమవారం ఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఆరోగ్య పంచాయతీ అవార్డును కలెక్టర్ అనుదీప్, సర్పంచ్ పొడియం సుజాత, కార్యదర్శి జక్కంపూడి షర్మిళ స్వీకరిం చారు. ఈ సందర్భంగా అవార్డులు ప్రదానోత్సవ కార్యక్ర మంలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవి చంద్ర, కలెక్టర్ అనుదీప్, డీపీఓ రమాకాంత్, సర్పంచును, కార్యదర్శిని అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ దేశ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో మన జిల్లాకు జాతీయ స్థాయిలో అవార్డులో రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో తొమ్మిది అంశాలలో ఉత్తమ గ్రామ పంచాయతీల ఎంపిక ప్రక్రియ నిర్వహించగా గౌతంపూర్ పంచాయతీ ఆరోగ్య పంచాయతీ విభాగంలో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచినట్లు చెప్పారు. సోమవారం ఢిల్లీలో నిర్వ హించిన అవార్డుల ప్రధానంలో రాష్ట్రపతి నుండి అవార్డు తీసుకో వడం చాలా సంతోషమని చెప్పారు. పారిశుధ్య కార్య క్రమాలు, పచ్చదనం పెంపొందించుటకు చేపట్టిన చర్యలు, అంటు వ్యాధులు ప్రబల కుండా ఇంటింటి నుండి వెలువ డుతున్న మురుగునీరు నిర్వహణ, అంటు వ్యాధులు దరిచే రకుండా చేపట్టిన కార్యక్రమాలు పట్ల అవార్డు సాధించినట్లు చెప్పారు. మన కృషికి దక్కిన గౌరవమని ఆయన పేర్కొ న్నారు. వ్యర్థాలు, వ్యాధులు నుండి స్వచ్ఛత కోసం చేసిన నిరంతర కృషి ఫలితంగా ఈ అవార్డు వచ్చిందన్నారు. ఇదే కృషిని కొసాగిస్తామని రాబోవు రోజుల్లో మన జిల్లాకు మరిన్ని అవార్డులు సాధిస్తామని చెప్పారు. మన జిల్లాను రోల్ మోడల్‌గా తయారు చేస్తామని చెప్పారు. ఈ అవార్డు సాధించడం మనందరి పనితనానికి లభించిన గౌరవమని ఆయన పేర్కొన్నారు. అవార్డు సాధనకు కృషి చేసిన సర్పంచ్ సుజాతను, కార్యదర్శి షర్మిళను, డీపీఓ రమాకాంత్‌ను, డీఆర్డీఓ మధుసూదన్ రాజును, జడ్పి సీఈఓ విద్యాలతను, ఎంపీడీఓ రమేషను, ఎంపీఓ సత్యనారా యణ ను, జిల్లా వైద్యాధికారి డా.శిరీషను, ఎఎన్ఎంలు సిహెచ్ విజయకుమారిని, బి.తులసిని, ఎల్. కౌసల్యని, టి.కాంతామణిని, ఆశా కార్యకర్తలు ఎం.సరితని, ఆర్.సరో జని, కె.నిర్మలని, బి.వెంకటలక్ష్మిని కలెక్టర్ అభినందించారు.