Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఏఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. ఏఎస్పీ ఉత్తర్వుల ప్రకారంగా ట్రాఫిక్ ఎస్ఐ పి.వి.ఎన్ రావు, తన సిబ్బందితో కలిసి సోమవారం నంబర్ ప్లేట్ లేకుండా తిరుగు ద్విచక్ర వాహనములు, నంబర్ ప్లేట్లకు స్టిక్కర్లు అంటించిన వాటిని, నెంబర్ సరిగా కనిపించని వాహనములు సుమారుగా (30), అధిక పెండింగ్ చలనాలు గల ద్విచక్ర వాహనములు (20), సరైన వాహన పత్రాలు లేని వాహనములు (20) సీజ్ చేసి పీఎస్కు తరలించి అట్టి వాహనదారులను కౌన్సిలింగ్ నిర్వహించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ హనదారులకు తప్పకుండా సరైన వాహన పత్రాలు కలిగి ఉండాలన్నారు. అనంతరం ట్రాఫ్ఫిక్ ఎస్ఐ పి.వి.ఎన్ రావు మాట్లాడుతూ ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండ, సరైన వాహన పత్రాలు లేకుండా వాహనములు నడిపితే వారిపై చట్ట పరమైన చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ పి.వి.ఎన్.రావు, సిబ్బంది, విలేకర్లు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.