Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇఫ్తార్ విందు కోసం రూ.38,000 వేలు అందజేత
నవతెలంగాణ-దుమ్ముగూడెం
రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లింలకు అందజేసే రంజాన్ తోఫాను భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య చేతుల మీదుగా అందజేశారు. తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన తోఫా పంపిణీతో పాటు ఇఫ్తార్ విందు కోసం రూ.38,000 వేలు మజీద్ ఇమామ్ ఖయ్యూంకు అందజేశారు. పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన మాట్టాడుతూ ముస్లిం సోదరులు అతి పవిత్రంగా నిర్వహించుకునే పండుగ రంజాన్ పండుగ మాత్రమేనని ఆయన అన్నారు. ఈ సందర్బంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేసు లకీë, జెడ్పీటీసీ సీతమ్మ, తహశీల్దార్ ప్రతాప్, ముస్లిం సోదరులు ఎండి బేగ్, ఎండి జానీపాషా, షేక్ హుస్సేన్ అహమద్, బీఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి కణితి రాముడు, గిర్దావార్లు ఆదినారాయణ, లక్ష్మయ్య రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.