Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మమ్ముళ్లను అన్యాయంగా ఖాళీ చేయించాలని చూస్తున్నారు
- బలవంతంగా ఖాళీ చేయించే ప్రసక్తే లేదు : జేసీ
నవతెలంగాణ-భద్రాచలం టౌన్
భద్రాచలం పట్టణంలో అశోక్ నగర్ కొత్త కాలనీ కరకట్టవాసులు వరద బాధితులు జిల్లా జాయింట్ కలెక్టర్‌కి వినతి పత్రం ఇచ్చి వారి బాధలను వివరించారు. గత 25 ఏండ్ల క్రితం అశోక్ నగర్ కొత్త కాలనీ చివరి బజార్లో ఉంటున్న సుమారు 20 కుటుంబాలు వాసులను పోకల కృష్ణార్జున రావు స్థలంలో ఉంటున్నారని, ఖాళీ చేపించి ఇవ్వాలని ఆనాటి అధికారులు కోరగా వారు మా ఇండ్లను కూల్చివేశారని, చివరికి నిరాస్రులైన పేదలను చూసి చెలించిన పోకల కృష్ణార్జున రావు కుమారులు వారి సొంత స్థలంలో సొంత భూమి అయినటువంటి సర్వే నంబర్ 2లో అశోక్ నగర్ కొత్త కాలనీ కరకట్ట దగ్గర సర్వే నిర్వహించి ఇళ్ల స్థలాలు, స్కూల్‌కి స్థలం కేటాయించినారని తెలిపారు. అనంతరం ఆ తరువాత కాలంలో ఎంపీ, ఎమ్మెల్యే, జడ్పీటీసీ, ఎంపీటీసీ, ప్రభుత్వ నిధులతో అన్ని సౌకర్యాలు ఏర్పరిచినారని తెలిపారు. గత 25 ఏండ్ల నుండి ఎప్పుడు గోదావరి వచ్చిన ఒకటి రెండు రోజులు ఇబ్బంది పడుతున్నప్పుడల్లా ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుని, అన్ని సౌకర్యాలు కల్పించేదన్నారు. కానీ కరకట్ట స్లూయిస్‌లు రిపేర్లు చేయకపోవడం వలన పోలవరం బ్యాక్ వాటర్ రావటం వలన 2022 గోదావరికి ఎక్కువసార్లు ముంపుకు గురైనదని, ఈ సందర్భంగా అధికారులు మొదటి సర్వేలో మీరు ఖాళీ చేయాలని చెప్పగా ఇప్పటికే రెండుసార్లు నష్టపోయిన మాకు పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ములుగుతున్నామన్నారు. కాబట్టి పోలవరం నిర్వాసితులకు ఇచ్చే ప్యాకేజీ మాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండోసారి సర్వేకు వచ్చినటువంటి తహసీల్దార్, స్థానిక అధికారులు, మార్కెట్ యార్డులో డబల్ బెడ్ రూమ్ నిర్మించి కొంత నష్టపరిహారం వచ్చే విధంగా చూస్తామని చెప్పారని, చివరికి కొంతమంది పేదలను ఏంసి కాలనీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు తరలించే ప్రయత్నం చేశారన్నారు. అక్కడికి మీరు కూడా వెళ్లాల్సిందే అని ఒత్తిడి చేస్తున్నారని, కానీ మేము 2022లో ప్రైవేట్ ల్యాండ్‌లో ఉన్నటువంటి మమ్ములను ఖాళీ చేయించే ప్రయత్నం ఆ రోజు అధికారులు ప్రభుత్వం చేసింది నేడు కూడా మేము పక్కా గృహాలు నిర్మించుకున్న మమ్ములను రెండోసారి ఖాళీ చేయించాలని ప్రయత్నం చేయటం సరికాదన్నారు. అన్ని విధాలు నష్టపోయిన మాకు ప్రభుత్వం ఆదుకోవాలని, పోలవరం ప్యాకేజీ ఇవ్వాలన్నారు. బలవంతంగా కాళీ చేసే విధానాన్ని వెనక్కి తీసుకోవాలని వారు కోరారు. సానుకూలంగా స్పందించిన జేసీ బలవంతంగా ఖాళీ చేయించే ప్రసక్తే లేదని, సంబంధిత అధికారులతో మాట్లాడతామని హామీ ఇచ్చినారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, పార్టీ పట్టణ కార్యదర్శులకు సభ్యులు వై.వి.రామారావు, నిర్వాసితులు ఝాన్సీ, సత్యవతి, పూర్ణ, సరోజిని, లక్ష్మి, రామాంజనేయులు, రాజి, రమణ తదితరులు పాల్గొన్నారు.