Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెడ్డాఫీస్ ముందు బాధితుల ఆందోళన
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి భూములు ఇచ్చి నిర్వాసితులగా మారిన బాధితులు హైకోర్టులో వేసిన ర్వాసితుల కేసులు యాజమాన్యం పరిష్కరిం చాలని హెడ్డాఫీస్ ముందు ఆందోళన నిర్వహించారు. సోమవారం స్థానిక సింగరేణి హెడ్డాఫీస్ ఎదురుగా ఆందోళన చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. జీవో ఎంఎస్ నెంబర్ 34 ప్రకారం 2010-15 మధ్య కాలంలో ప్రాజెక్టు డిస్పోస్్ అయిన కుటుంబాలకు మైనింగ్ ఇండిస్టియల్ ప్రాజెక్టులలో కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాల్సి ఉండగా మణుగూరు, ఇల్లందు, ధారపాడు, బెల్లంపల్లి ఏరియాలలో 532 కుటుంబాలకు గాను సుమారు 400 కుటుంబాలకు సింగరేణి యాజమాన్యం ఉద్యోగాలు కల్పించింది. మిగిలిన 132 కుటుంబాలకు కూడా ఉద్యోగాలు కల్పించి సింగరేణి యాజమాన్యం ఆదుకోవాలని నిర్వాసితులు యాజమాన్యాన్ని కోరారు. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించి, స్పందించకపోవడంతో భూ నిర్వాసితులు హైకోర్టులో పిటీషన్ వేయడంతో వారికి గౌరవ హైకోర్టు కొన్ని పోస్టులు రిజర్వ్ చేయడం జరిగిందని చెప్పారు. కేసు విచారణలో ఫైనల్ హియరింగ్కి సింగరేణి తరఫున న్యాయవా దులు కోర్టులో విచారణకు సహకరించక పోవడంతో గత ఆరు నెలలుగా తమ కేసులలో జడ్జిమెంట్ రావడం లేదని, తధనుగుణంగా తమకు అన్యాయం జరుగుతుందని బాదితులు ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం స్పందించి పెండింగ్లో ఉన్న కేసు పరిష్కారానికి కృషి చేయాలని సింగరేణి ప్రధాన కార్యాలయంలోని కొందరు అధికారు లను కలిసి వినతి పత్రం అందజేశారు. అందుకు స్పందించిన అధికారులు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని నిర్వాసితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితులు మాలోత్ దిలీప్ కుమార్, భూక్యా హరి, సనప కరుణాకర్, జార అరుణ, ఈశ్వరి, తదితరులు పాల్గొన్నారు.