Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వై.రాంగోపాల్
నవతెలంగాణ-మణుగూరు
రోజురోజుకి ఎండలు మండుతున్నాయని, సింగరేణిలో ఉష్ణతాపం పెరుగుతుందని, కార్మికుల సౌకర్యార్థం పని వేళలు మార్చాలని, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) బ్రాంచ్ సెక్రటరీ వై.రాంగోపాల్ యాజమాన్యం కోరారు. సోమవారం వినతి పత్రాలు సమర్పించారు. ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పీకేఓసీటులో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. పీకేఓసీ 2లో సర్ఫేస్ మైనర్, డ్రిల్‌ను ప్రైవేటు వారికి ఇవ్వడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ మణుగూరులోని ఓసీలలో అధికారులకు మెమోరాండం అందజేశారు. వేసవిలో సింగరేణిలో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకున్నాయని, అధిక ఉష్ణోగ్రత వలన క్వారీలో పనిచేసే ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కావున మేనేజ్మెంట్ పని వేళలు మార్చాలని డిమాండ్ చేశారు. క్వారీలలో రెస్ట్ షెల్టర్‌ను ఏర్పాటు చేయాలని, గనుల పైన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని, చల్లని నీరు, మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కార్మికులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. గత ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన టార్గెట్‌ను సాధించిన కార్మికులకు స్వీట్ ప్యాకెట్ అందజేయాలని, ప్రోత్సాహక బహుమతులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ బేరర్స్ ఎం.వి.రాం నర్సయ్య, నంబూరు శ్రీనివాస్, ఆవుల నాగరాజు, ఆధర్ల సురేందర్, పిట్ సెక్రటరీలు డి.మల్లేష్, కోడి రెక్కల శ్రీనివాస్, దాట్ల సందీప్, జి.పుల్లారావు, చోప్ప సుధాకర్, ముప్పారపు నాగేశ్వరరావు, పువ్వాడ రాజేశ్వరరావు, పాటి ప్రసాద్, బాజా కార్తీక్, బొక్క శ్రీను, తదితరులు పాల్గొన్నారు.