Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు జేసీ ఆదేశం
- ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరణ
నవతెలంగాణ-పాల్వంచ
అన్ని శాఖల వారిగా జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఈ నెల 22వ తేదీ వరకు ప్రగతి నివేదికలు అందజేయాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు నుండి ఫిర్యాదు దరఖాస్తు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపాక నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై క్లుప్తంగా తెలుగులో ఒక పేజీని మించకుండా తయారు చేసిన ప్రగతి నివేదికలను జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అందజేయాలని అన్ని శాఖల జిల్లా అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల్లో సుజాతనగర్ మండలం గరీబ్ పేట గ్రామానికి చెందిన తమ రాజమ్మ భర్త లేటు నరసయ్య సర్వేనెంబర్ 15ఆ లో 23 గుంటలు 15/6/3 లో 23 గుంటలు 16/6 లో 21 భూమి కలదని అట్టి తన స్వాధీనంలోనే ఉన్నదని భూమి శిస్తు కూడా చెల్లిస్తున్నానని పట్టాలు ఇప్పించాలని చేసిన దరఖాస్తులు పరిశీలించిన అదనపు కలెక్టర్ తగు చర్యలకు నిమిత్తం సెక్షన్ పరీక్షలకు సిఫాస్ చేశారు. తదితర మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదులను అదనపు కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం సంబందిత అధికారులను ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.