Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
ముస్లిం మైనార్టీల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం అని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రంజాన్ సందర్భంగా పేద ముస్లీంలకు రంజాన్ తోఫాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొత్తగూడెంలోని సుమారు 50 మసీదులకు రూ.4 లక్షల నగదును పంపిణీ చేశామన్నారు. కొత్తగూడెం ముస్లిం సోదరుల అభివృద్ది కోసం అనేక కార్యక్రమాలు చేశామని చెప్పారు. రూ.70 కోట్లతో ఉర్దూగర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశామని, త్వరలోనే రామాంజనేయ కాలనీ పక్కన ముస్లింల కొరకు ఖబ్రస్తాన్ స్థలం ఏర్పాటు, పాత కొత్తగూడెంలో ముస్లిం సోదరుల కోసం మరొక ఖబ్రస్తాన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వనమా రాఘవేంద్రరావు, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీ బాదవత్ శాంతి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, వివిధ మసీదుల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, మత పెద్దలు పాల్గొన్నారు.