Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోరుబావిని సాయి నగర్ వాసులు సద్వినియోగపరచుకోండి
- సీఆర్పిఎఫ్ 81 బెటాలియన్ కమాండెంట్ సంజీవ్ కుమార్
నవతెలంగాణ-చర్ల
సమాజ సేవలో సీఆర్పిఎఫ్ ముందంజలో ఉంటుందని సీఆర్పిఎఫ్ 81 బెటాలియన్ కమాండెంట్ సంజీవ్ కుమార్ అన్నారు. సోమవారం చర్ల మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల సాయి నగర్లో బోరు బావిని ప్రారంభించి ఆయన మాట్లాడారు. సాయి నగర్ వాసులకు ఏర్పడిన నీటి సమస్యను వార్డు సభ్యులు దొడ్డి హరినాగ వర్మ ద్వారా తెలుసుకొని వెంటనే స్పందించి బోరుబావి నిర్మాణానికి కావలసిన నిధులను సివిక్ యాక్షన్ ప్రోగ్రాంలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. మండల వ్యాప్తంగా పూసుగుప్ప, చెన్నాపురంతో పాటు మరిన్ని గ్రామాలలో సుమారు 7 బోరుబావులను నిర్మించి నిరుపేదల దాహార్తి తీర్చడానికి కృషి చేసినట్లు ఆయన తెలిపారు. మండువేసవిలో గుక్కెడు తాగునీరు దొరకక అవస్థలు పడుతున్న ఆదివాసి గ్రామాలతో పాటు సాయి నగర్లో సుమారు లక్ష రూపాయల వ్యయంతో బోరుబావి నిర్మించి ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. సిఆర్పిఎఫ్ 81, 141, 151 బెటాలియాలు సమాజ రక్షణతో పాటు సమాజ సేవలో ముందంజలో ఉంటుందని ఆయన తెలిపారు. విద్యా, వైద్యంతో పాటు నిరుపేదలకు అని విధాల మౌలిక సదుపాయాలు అందించడంలో ముందంజలో సిఆర్పిఎఫ్ ఉంటుందని ఆయన పునర్గాటించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ మాట్లాడుతూ నిరుపేదలకు సేవలందించడంలో పోలీసులు అన్ని విధాల సహకరించడం అభినందనీయమన్నారు. అదేవిధంగా మినరల్ వాటర్ సదుపాయాన్ని కూడా అందించడంలో సీఆర్పీఎఫ్ అధికారులు చొరవ చూపాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 151 బెటాలియన్ సెకండ్ కమాండెంట్ అయోధ్య సింగ్, 81 బెటాలియన్ మెడికల్ ఆఫీసర్ భినోద్ తోప్పొ, సీఆర్పీఎఫ్ డాక్టర్ అరుణ్ కుమార్, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కాపుల కృష్ణార్జునారావు, ఉపసర్పంచ్ శివ లక్ష్మీనారాయణ, పిఎసిఎస్ డైరెక్టర్ పరుచూరి రవి, సిఆర్పిఎఫ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.