Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కోశాధికారి జి.పద్మ
నవతెలంగాణ-పాల్వంచ
వీవోఏల శ్రమ ప్రభుత్వం దోచుకుంటుందని సీఐటీయూ జిల్లా కోశాధికారి జి.పద్మ అన్నారు. తెలంగాణ ఐకేపీ వీవోఏ ఉద్యోగుల సంఘం సీఐటీయూ పాల్వంచలో సోమవారం సమ్మె చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ సీనియర్ నాయకులు సాంబశివరావు హాజరై ప్రారంభించారు. సందర్భంగా జిల్లా కోశాధికారి పద్మ మాట్లాడుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త సమ్మె జరుగుతుందని ఈ సమ్మె చేయడానికి ప్రభుత్వమే కారణమని అన్నారు. సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికే అధికారులకు ప్రభుత్వానికి ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ టోకెన్ సమ్మెలో చేసినప్పటికీ ఏమాత్రం స్పందించకపోవడంతోటి సమ్మెలోకి వెళ్లాల్సివచ్చిందన్నారు. కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, వీవోఏలను సేర్పు ఉద్యోగుల గుర్తించాలని గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు వినోద వీవోఏల సమ్మెకు వారి సంపూర్ణ మద్దతుని తెలియజేశారు. సీఐటీయూ సీనియర్ నాయకులు రాందాస్ మద్దతుని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కన్వీనర్ కే.సత్య, వీవోఏల సంఘం అధ్యక్ష కార్యదర్శులు వి.అనురాధ, కార్యదర్శి ఎన్.రమేష్, రమాదేవి, ఉమా, కృష్ణవేణి, సుజాత తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం వీఓఏలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి జి.పద్మ డిమాండ్ చేశారు. సోమవారం నుండి ప్రారంభమైన వీఓఏల రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా కొత్తగూడెం స్థానిక చిల్డ్రన్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరాన్ని పద్మ ప్రారంభించి, మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 17606 మంది విఓఏలు గత 19 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని తెలిపారు. వారికి చాలీ చాలని జీతాలు ఇస్తూ పెట్టి చాకిరి చేయిస్తూన్నారని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కార దిశగా ఆలోచన చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి డి.వీరన్న, వీఓఏల సంఘం నాయకులు రేష్మ, మాధవి, స్వరూప, మైమున్నీసా, సత్యవతి, అరుణ, రాజమణి, పద్మ, వింధ్య, సఫియా, జాహీదా, రజిత, పద్మ,అరుణ, కృష్ణకుమారి, పద్మ, సుజాత, రమణ, లావణ్య, బేబీ, కవిత, స్వర్ణరేఖ తదితరులు పాల్గొన్నారు.
చర్ల : ఐకేపీ వీఓఏల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కారం నరేష్ డిమాండ్ చేశారు. సోమవారం చర్ల బస్టాండ్ సెంటర్లో రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటున్న ఐకేపీ వీవోఏ ఉద్యోగులు సమ్మెను ప్రారంభించి ఉద్దేశించి మాట్లాడారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, 10 లక్షల సాధారణ భీమా ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకురాలు పొడుపుకంటి సమ్మక్క, సీఐటీయూ నాయకులు పామారు బాలాజీ, చర్ల వార్డు నెంబర్ హరి నాగ వర్మ తదితరులు సంఘీభావం తెలియజేశారు.
బూర్గంపాడు : ఐకేపీ వీఓఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి, ఐడీ కార్డులు ఇవ్వాలని సీఐటీయూ మండల కన్వీనర్ బర్ల తిరుపతయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలో నిరవదిక సమ్మె ప్రారంభించారు. పూలదండవేసి సమ్మెను వ్యకాస కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, కేవీపీఎస్ నాయకులు రాయల వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈసంధర్భంగా తిరుపతయ్య మాట్లాడారు. ఈ సందర్బంగా సంఘ అధ్యక్ష, కార్యదర్శులు యన్.శ్రీలక్ష్మీ, పద్మవతి, కామాల్బీ, పాపారావు, పోశమ్మ మాట్లాడారు. ఈ సమ్మెలో మొదటిరోజు 49 మంది వీఓఎలు పాల్గొన్నారు.
కరకగూడెం : మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం ఆవరణలో జరుగుతున్న సమ్మె శిబిరన్ని సందర్శించిన సీఐటీయూ నాయకులు కొమరం కాంతారావు సమ్మె చేస్తున్న సిబ్బందికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకేపీ, వివోఏల శ్రమను ప్రభుత్వం దోచుకుంటున్నారని విపరీతమైన పని భారం పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇలందు : న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఐకేపీ వీఓఏ నిరవధిక సమ్మెను సోమవారం సీఐటీయూ జిల్లా నేత అబ్దుల్ నబి, తాళ్లూరి కృష్ణలు ప్రారంభించారు. అనంతరం నవ్య అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడారు. నిరవధిక సమ్మెలో కూర్చొని మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, తదితర డిమాండ్లను నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమానికి మండల కమిటీ అధ్యక్షురాలు నవ్య, కార్యనిర్మాణ అధ్యక్షులు పాపారావు, ప్రధాన కార్యదర్శి మోతిలాల్, కార్యదర్శి వసంతరావు, కోశాధికారి నీలాబాయి, ప్రమీల, సుల్తానా, పృద్వి తదితరులు ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు.
దమ్మపేట : వీవోఏల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ అన్నారు. సోమవారం వీవోఏలు తమ సమస్యలు పరిష్కారించాలని రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ఎంపీడీవో కార్యాలయం వద్ద రాజ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అర్జున్ మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కారించాలని సంబదిత అధికారులకు, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళిన స్పందించని కారణంగానే నిరవధిక సమ్మెకు వెళ్లాల్సి వచ్చింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు శ్రీను, ధనలక్ష్మి, పద్మ, నాగమణి, పుష్ప, శ్రీదేవి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లి : విఓఏలుగా ఎన్నోఏండ్లుగా పని చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించక పోవడంతో విఓఏ మండల అధ్యక్షురాలు కమల కుమారి ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. ఈ సమ్మెకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ హాజరై వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.26000 ఇవ్వాలని, రూ.10 లక్షలు సాధారణ ఆరోగ్య భీమా కల్పించాలన్నారు. ఈ సమ్మెలో మండల ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి షేక్ ఆలింబి, సుజి వెంకటేశ్వరావు, సత్యనారాయణ, బ్రహ్మం, సీఐటీయూ మండల నాయకులు వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : వీఓఏల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ మండల కన్వీనర్ కొర్సా చిలకమ్మ డిమాండ్ చేశారు. లకీëనగరం ఎస్బిఐ భ్యాంకు కార్యాలయం ఎదుట సీఐటీయూ అనుబంద వీఓఏల ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధి సమ్మెను కొర్సా చిలకమ్మ, వీఓఏల మండల అద్యక్షులు గద్దల వెంకటేశ్వర్లు దండలు వేసి ప్రారంభించి, మాట్లాడారు. నిరవధిక సమ్మెల్లో వీఓఏలు కె.నాగరాజు, కుమారి, వెంకటేష్, అరుణ, రాజేశ్వరి, వెంకటలకీë, గుట్టయ్య, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట వీవోఏల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ అన్నారు. సోమవారం పాత ఎంపీడీవో కార్యాలయం వద్ద షాహీనా అధ్యక్షతన జరిగిన సమావేశంలో అర్జున్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బేబి, రేవతి, శివ కుమారి తదితరులు పాల్గొన్నారు.