Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో ఓపెన్ ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ అన్నారు. ఐడిఓసి అదనపు కలెక్టర్ చాంబర్లో అధికారులతో లఓపెన్ ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్థేశించిన షెడ్యూలు ప్రకారం పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 25 ఏప్రిల్ నుండి 04 మే 2023 వరకు ఓపెన్ ఇంటర్, పదో తరగతి పరీక్షలు నిర్వహించ నున్నట్లు తెలిపారు. ఓపెన్ ఇంటర్‌కు 1278 మంది, పదవ తరగతి పరీక్షలకు 810, మొత్తం 2,095 మంది బాల, బాలికలు పరీక్షలు రాయనున్నట్లు, వీటి నిర్వహణకు 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఉ. 9.00 నుండి మ.12.00 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, విద్యార్దులు ఒక గంట ముందుగా పరీక్షా కేంద్రానికి హాజరుకావాలని సూచించారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో అవసరమైన మౌలిక వసతులు ఏర్పాట్లు చేయాలని, వేసవి దృష్టా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రతి కేంద్రం వద్ద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని, ఓ.అర్.ఎస్. ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. జిల్లాలో పరీక్ష ప్రశ్నాపత్రాలను నిల్వచేయుటకు పోలీస్ స్టేషన్లలో తగిన ఏర్పాట్లు చేయాలని, పటిష్ట బందోబస్తు చేపట్టాలని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సెంటర్లలో మాస్ కాపీయింగ్, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. మొబ్కెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదని అన్నారు. ప్లైయింగ్ స్వ్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేసి పరీక్ష జరుగుతున్న తీరుపై నిఘా ఉంచాలని, 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద మంచి నీరు, ఫ్యాన్లు, ల్కెట్లు సరిఅయిన విధంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పరీక్ష నిర్వహణ అనంతరం సమాధాన పత్రాలను పోస్టల్ ద్వారా తరలించే ప్రక్రియ సజావుగా చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ సహాయ సంచాలకులు ఎం.వి.చారీ, డి.సి.టి.ఓ ఎస్ఎస్ ఎం.పాపారావు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డా. బి.మాలతి, పోలీసు శాఖ , పోస్టల్ శాఖ, విద్యుత్ శాఖ, ఆర్.టి.సి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.