Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లారీలు ఢకొీని డ్రైవరు మృతిచెందగా
- మరో డీసీఎం చెట్టును ఢకొీట్టి డ్రైవరు మృతి
- ఘటనా ప్రదేశాలను పరిశీలించిన ఏసీపీ, సీఐ
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి పట్టణ శివారులో సోమవారం అర్థరాత్రి దాటాక వేర్వేరుగా జరిగిన రెండు రోడ్డు ఘో ప్రమాదాల్లో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృత్యువాతకు గురయ్యారు. పట్టణ శివారు వైకుంఠథామం సమీపంలో ఎదురెదురుగా వచ్చిన లారీలు వేగంగా ఢకొీనడంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవరు జనుల్ లారీ క్యాబిన్లో ఇరుక్కొని అక్కడికక్కడే మృతిచెందాడు. మరో లారీ క్లీనరుకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే అతడ్ని ఖమ్మం తరలించారు. క్యాబిన్లో ఇరుక్కొని మరణించిన లారీ డ్రైవర్ జనుల్ మృతదేహాన్ని తీసేందుకు పోలీసులు, స్థానికులు తీవ్రంగా శ్రమపడ్డారు. ఎట్టకేలకు జేసీబీని ఉపయోగించి మృతదేహాన్ని బయటకు తీయగలిగారు.
ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి....
పట్టణ శివారులోని పెద్ద వంతెన సమీపంలో అశ్వారావుపేట వైపు నుంచి వస్తున్న డీసీఎం వ్యాను ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి వేగంగా చెట్టును ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం వ్యాను ముందుభాగం నుజ్జునుజ్జయింది. డ్రైవరుకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మరణించాడు. మృతుడిది జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చిట్యాలకు చెందిన యడవెల్లి నరేశ్‌గా గుర్తించారు.
ఘటనా స్థలాలను పరిశీలించిన ఏసీపీ, సీఐ...
వేర్వేరుగా రెండు రోడ్డు ప్రమాదాలు జరిగి ఇద్దరు డ్రైవర్లు మృతిచెందడంతో ఏసీపీ బొజ్జ రామానుజం, సీఐ తాటిపాముల కరుణాకర్ ఘటనా ప్రదేశాలను పరిశీలించారు. ప్రమాదాలు జరిగిన తీరును తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరి డ్రైవర్ల మృతదేహాలను పంచనామా నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రి శవాగారానికి తరలించారు.