Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి
- తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్‌కి వినతి
నవతెలంగాణ-ఖమ్మం
రబీ సీజన్లో పండిన మొక్కజొన్నలు ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని కలెక్టరేట్లో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతులు అదనపు కలెక్టర్ మధుసూదనరావుకి సోమవారం వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ అకాల వర్షాలు, వడగండ్ల వానతో రైతులు నష్టపోయి ఉన్నారని, మొక్కజొన్న పంట పొలం నుండి బయటకు తీసుకురావడానికి కోత మిషన్, కూలీలు ఖర్చు గతం కంటే రెండు రెట్లు ఎక్కువగా అవుతుందన్నారు. మరోవైపు రోజు రోజుకు మొక్కజొన్న ధర తగ్గి పోతుంది అన్నారు. క్వింటాళ్లకు 2300 రూపాయలు ఉన్న ధర ఐదు వందల రూపాయలు పైగా తగ్గి 1800 రూపాయలుకు ప్రవైట్ వ్యక్తులు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాళ్లకు 1960 ఉందని ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేయాలి అని కోరారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని అదనపు కలెక్టర్ మధుసూదనరావు దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శలు చింతనిప్పు చలపతిరావు, ఎస్కే మీరా, తుళ్ళూరి రమేష్, తాళ్ళపల్లి కృష్ణ, చెరకుమల్లి కుటుంబరావు, మాడుపల్లి గోపాల్ రావు, జోన్నబోయిన అంజయ్య, అన్నావరపు వెంకటేశ్వరరావు, కిన్నెర ప్రభాకరరావు రైతులు పాల్గొన్నారు.