Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అహ్మదాబాద్ కేంద్ర ప్రభుత్వం, యునిసెఫ్ సౌజన్యంతో 2023లో ప్రచురించబడే పుస్తకంలో క్లీన్ అండ్ గ్రీన్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ విభాగంలో తెలంగాణ రాష్ట్రంలోని మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ బండారిగూడెం స్థానం సంపాదించిందని యూనిసెఫ్ ప్రతినిధి శ్రేయస్ సజీవన్ తెలిపారు. మంగళవారం ఆయన దుమ్ముగూడెం మండలంలోని బండారుగూడెం ప్రాథమిక పాఠశాలను సందర్శించి అన్ని విషయాలను సమీక్షించారు. అనంతరం సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాబెక్కంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ పాఠశాలను అన్ని విధాలుగా ఆదుకుంటున్న గ్రామ పాలకమండలి, విద్యా కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, మండల, జిల్లా, రాష్ట్ర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఈఈకి చెందిన యూనిసెఫ్ బృందం పాఠశాలను సందర్శించి, సమగ్ర సమాచారాన్ని సేకరించారు. సందర్శనలో సర్పంచ్ కాటిబోయిన చిన వెంకటేశ్వర్లు, విద్యాకమిటీ చైర్మన్ కుంజా, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, శ్రీనివాసరావు, మన వూరు మన బడి అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు ఎవి సీతారాం తదితరులు పాల్గొన్నారు.