Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
నవతెలంగాణ-పాల్వంచ
కేటీపీఎస్ 6వ దశ నిర్మాణంలో పనిచేసిన కార్మికులకు ఉద్యోగాలు కల్పి స్తానని రాతపూ ర్వకంగా సీఎండీ రాసి ఇచ్చిన హామీని నిలబ ెట్టుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు. మంగళవారం స్థానిక కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్లో 6వ దశ నిర్మాణ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహారదీక్షలో భాగంగా రెండవ దీక్షలను ప్రారంభించి కామేష్ మాట్లాడారు. సుమారు 400 మంది కార్మికులు 15 ఏండ్లుగా రెక్కలు ముక్కలు చేసుకొని కాళ్ళు, చేతులు పోయిన ఎన్నో ప్రమాదాలకు గురైన, తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా 6వ దశ నిర్మాణంలో పనిచేశారన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కొన్ని నెలలుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న స్థానిక శాసనసభ్యులు స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందంచి కార్మికులను 7దశలో పనికి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, జెట్టి ఆనందరావు, కార్మికులు ఎస్.కే.రావూఫ్, శ్రీనివాసరావు, రమేష్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.