Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణ ప్రముఖులు, రాజకీయ నాయకులు నివాళులు
నవతెలంగాణ-మణుగూరు
పట్టణ ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ మాజీ నాయకులు కుడితిపూడి సాంబశివరావు (93) మంగళవారం కన్నుమూశారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం అంబేద్కర్ సెంటర్లో మొదట భవనాలు నిర్మించినారు. ఎన్‌టి రామారావుతో ఉన్న అభిమానంతో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సుదీర్ఘకాలం ఉచితంగా భవనం ఇచ్చారు. మొదట తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉన్న కారణంగా ఆ సెంటర్‌ను టీడీపీ సెంటర్‌గా రూపాంతరంగా మారింది. అందరి నోట టీడీపీ సెంటర్ అనే మాట సర్వసాధారణమైపోయింది. ఆయన ఉచితంగా కార్యాలయానికి భవనం ఇవ్వడం కారణంగానే ఆ పేరు వచ్చిందని పలువురు కొనియాడారు. డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు వాసిరెడ్డి చలపతిరావు, నామ వెంకటేశ్వరరావు, కూచిపూడి బాబు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, లైన్స్ క్లబ్ పెద్దలు పిల్లాడి శెట్టి హరిబాబు, లైన్స్ క్లబ్ పెద్దలు, పుర ప్రముఖులు అధిక సంఖ్యలో హాజరై సాంబశివరావు మృతికి సంతాపం ప్రకటిస్తూ, కుటుంబ సభ్యులకి సానుభూతి తెలిపారు.