Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెంలీగల్
తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు గ్రామాలలోని రైతులకు వ్యవసాయ సలహాలు, న్యాయ సహయంను ఉచితంగా అందించడం కోసం వ్యవసాయ న్యాయ సహాయ కేంద్రంను ఏప్రిల్ 21న లోతువాగు గ్రామం, లక్ష్మీదేవి పల్లి మండలంలో ప్రారంభించడం జరుగుతుందని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా నుండి లక్ష్మీదేవి పల్లి మండలంలోని లోతు వాగు గ్రామంలోని రైతు వేదిక, మణుగూరు, భద్రాచలంలోని ఐటీడీఏ ఆఫీసు, పర్ణశాలలలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభంకు సంబంధించిన ఏర్పాట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ అభిమన్యుడు, డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ మధుసూదన రాజు, డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ స్వర్ణలత లెనిన, ఏపీఓ ఉదయ భాస్కర్, ఐటీడీఏ భద్రాచలం, మున్సిపల్ ఏఈ అధికారులతో సమావేశంను నిర్వహించి క్లినిక్ ఏర్పాట్లను ఆదేశించారు.