Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
మేము సైతం మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధితుడికి ఆర్థిక వితరణ చేసినట్లు ట్రస్టు నిర్వాహకులు తెలిపారు. మంగళవారం మణుగూరు మండలం ఆదర్శనగర్ ప్రాంతానికి చెందిన దండుగుల అయ్యప్ప లారి క్లీనర్‌గా జీవనం కొనసాగిస్తున్నారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ నోట్లో ఉన్న నాలుకను తీసేసి అతి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాడు. బయటికి వెళ్లి ఏ పని చేసుకోలేని పరిస్థితి నెలకొన్నది. మరోపక్క ఆసుపత్రికి వెళ్లడానికి చార్జీలు కూడా లేని దయానియా పరిస్థితి. తినడానికి కూడా ఏమీ లేక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న తెలుసుకున్న ట్రస్ట్ నిర్వాహకులు అయ్యప్ప ఇంటికి చేరుకొని ఆ కుటుంబానికి ధైర్యాన్ని చెప్పారు. ట్రస్ట్ నుండి రూ.3 వేలు, ట్రస్ట్ గౌరవ సలహాదారులు ప్రముఖ వ్యాపారి బేతంచర్ల వెంకటేశ్వరరావు రూ.1000 మొత్తం రూ.4 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేము సైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి మార్తి శ్రీనివాసరావు, ట్రెజరర్ రంగా శ్రీనివాసరావు, మల్లికార్జున్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.