Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డి.వీరన్న
నవతెలంగాణ-కొత్తగూడెం
కాంట్రాక్టు కార్మికులకు చెల్లించాల్సిన 17నెలల ఏరియర్ వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డి.వీరన్న సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సిఐటియూ బ్రాంచి కార్యదర్శి గిడ్ల శ్యాం కుమార్ అధ్యక్షతన ట్రాన్సిట్ గెస్ట్ హౌస్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని కలవడం జరిగింది. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డి.వీరన్న మాట్లాడుతూ కార్మికులకు 17 నెలల ఎరియర్స్ డబ్బులు వెంటనే చెల్లించాలని, జీతం చీటీలు ఏడవ తారీకు వరకు ఇవ్వాలని, పేమెంట్ ప్రతి నెల 7వ తేదీలోపే చెల్లించాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ మెంబర్ భూక్యా రమేష్ తదితరులు పాల్గొన్నారు..
పనికి తగిన వేతనం ఇవ్వాలి
సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సిఐటియూ జిల్లా సహాయకార్యదర్శి డి.వీరన్న, జిల్లా కమిటీ మెంబర్ బి.రమేష్‌లు డిమాండ్ చేశారు. మంగళవారం సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సంఘం (ఎస్సీకెఎస్-సిఐటియూ) బ్రాంచ్ కమిటీ అధ్యక్షులు ఎమ్.చంద్రశేఖర్, కార్యదర్శి జి.శ్యామ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సివిల్ డిపార్ట్మెంట్లోని డివైజిఎంని కలిసి, వాటర్ సప్లై వాళ్లు గత 15 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు. వారికి అన్‌స్కిల్డ్ పేమెంట్ ఇస్తున్నారని, వారికి స్కిల్డ్ పేమెంట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియూ బ్రాంచ్ ట్రెజరర్ సూరం అయిలయ్య, బ్రాంచ్ కమిటీ మెంబర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.