Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీటి సమస్య రాకుండా పకడ్బందీ చర్యలు
- మున్సిపల్ చైర్మన్, కమిషనర్
నవతెలంగాణ-ఇల్లందు
వేసవి కాలంలో పట్టణ ప్రజలకు నీటి సమస్య రాకుండా ఇక ప్రతిరోజు మంచినీటి సరఫరా నిర్వహిస్తామని మున్సిపల్ చైర్మన్, కమిషనర్ వెంకటేశ్వరరావు, అంకూషావళి అన్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తగా పైన సంబం ధిత అంశాలపై ఇంజనీరింగ్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో నీటి సమస్య రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. పంపు బిల్లులు కూడా ఆన్లైన్లోనే కట్టించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ అంకు షావలి మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వా ములు కావాలని పిలుపునిచ్చారు. పంపు బిల్లులు ఆన్లైన్ ద్వారానే కట్టించేందుకు చర్యలు చేపడుతున్నామని అధికారులు మీ ఇంటి వద్దకు వచ్చి సర్వే నిర్వహిస్తారని వారికి పట్టణ ప్రజలందరూ సహకరించాలని కోరారు. సర్వేకి వెళ్లే అధికారులు పనిలో అలసత్వం వహించకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపాలిటీ ఏఈ శంకర్, ఆర్ఐ శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్లు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.