Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
మహిళలపై పెరుగుతున్న దాడులను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫమయ్యాయని ఐద్వా పట్టణ ప్రధాన కార్యదర్శి డి.సీతాలక్ష్మి అన్నారు. మంగళవారం పట్టణ కమిటీ సమావేశం పుస్తెల జ్యోతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సీతాలక్ష్మి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 8 సంవత్సరాల కాలంలో మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు విపరీతంగా పెరిగాయని, పని ప్రదేశాలలో మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని విమర్శించారు. నూటికి 60 శాతం మంది మహిళలు కుటుంబ బాధ్యత చూస్తున్నారని అన్నారు. కేంద్రం పెంచిన వంట గ్యాస్ ధరలు వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిత్యవసర వస్తువల ధరలు కరెంటు, పెట్రోలు, డీజిల్, విపరీతంగా పెరిగాయని అన్నారు. రేషన్ షాపుల ద్వారా అందించవలసిన నిత్యవసర వస్తువులు ఇవ్వకుండా ఒక మనిషికి కేవలం 6 కేజీలు బియ్యం మాత్రమే ఇస్తున్నారు. మనిషికి 6 కేజీల బియ్యం ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. 15 కేజీల బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఆఫీస్ బేరర్ నాదెళ్ల లీలావతి, జిల్లా కమిటీ సభ్యులు జీవనజ్యోతి, కమిటీ సభ్యులు సున్నం గంగా, రాధా, వనమ్మ, రమణ, గడ్డం నాగలక్ష్మి, పెల్లెం లక్ష్మి కాంత, పుణ్యావతి, సుశీల, మడెం లక్ష్మి, సౌదామని పాల్గొన్నారు.