Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనం రూ.26 వేలు నిర్ధారించాలి
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బ్రహ్మచారి
నవతెలంగాణ -బూర్గంపాడు
ఐకేపీ-వీఓఏల సమస్యలను పరిష్కరించాలని, కనీస వేతనం రూ.26000 నిర్ధారించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కొలగాని బ్రహ్మచారి అన్నారు. మండల కేంద్రంలో సమ్మె విజయవంతంగా మంగళవారం 2వ రోజుకు చేరుకుంది. సీఐటీయూ నాయకులు పుట్టి పాపారావు, మండల కన్వెనర్ బర్ల తిరుపతయ్య దీక్షార్హులకు పూల దండలు వేసి సమ్మె శిబిరాన్ని ప్రారంభించారు. సమ్మె శిభిరాన్ని సీఐటీయూ సంఘ జిల్లా కోశాధికారి చంద్రలీల, జిల్లా అధ్యక్షులు బ్రాహ్మచారిలు సందర్శించారు. ఈ సందర్భంగా బ్రహ్మచారి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీఓఏలు తమ పనులే కాకుండా పై ఆఫీసర్ల ఆన్ లైన్ పనులు కూడా చేస్తున్నారని, ఈ ఆన్ లైన్ పనికి ప్రత్యేకంగా ఏవిధంగా భత్యం ఉండదని ఆయన పేర్కొన్నారు. వీరికి ఐకెపిలో సరైన గుర్తింపు కూడా లేదన్నారు. కనీస వేతనం రూ.26 వేలు నిర్ధారించి, గుర్తింపు కార్డులు ఇచ్చి సెర్ప్ ఉద్యొగులుగా నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీలక్ష్మీ, పద్మావతి, కమల్ బీ, లక్ష్మీ, రమణ, నాగమణి, సక్రు, సాగరిక, విమలావతి, రాధిక, రామచందర్, రాజేశ్వరి, సుభద్ర, ఉమా, చంద్రదేవి తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం రూరల్ : వీవోఏలు చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా భద్రాచలం పట్టణం వీవోఏల సంఘం అంబేద్కర్ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద కొనసాగుతున్న నిరవధిక సమ్మెను ముఖ్య అతిథిగా హాజరైన జి.ఎస్ శంకర్ రావు ప్రారంభించి ఆయన మాట్లాడుతూ గ్రామ దీపికలుగా డ్వాక్రా గ్రూపులలో మహిళలని చేర్పించి వారి కుటుంబాల ఆర్థిక అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ కష్టపడి పని చేస్తున్నారన్నారు. ఈ దీక్షా శిబిరం సంఘీభావం తెలపడానికి వచ్చిన సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బ్రహ్మచారి మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను పగడ్బందీగా అమలు చేయాలన్నారు. దీక్షను మానస హౌటల్ అధినేత ముదిగొండ రాము నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయ కులు ఎం.బి.నర్సారెడ్డి, శ్రామిక మహిళ పట్టణ కన్వీనర్ మర్లపాటి రేణుక, సీఐటీయూ టౌన్ కమిటీ సభ్యులు నాగరాజు, గుడుపల్లి లక్ష్మి కాంత్, ఏ.రాము, వీవోఏల సంఘం అధ్యక్ష కార్యదర్శులు వెంకటలక్ష్మి, చంద్రలీల సీతారత్నం రాము తదితరులు పాల్గొన్నారు.