Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
మావోయిస్టు పార్టీ ఎల్ఓఎస్ కమాండర్, డిప్యూటీ కమాండర్ సభ్యురాలను అరెస్ట్ చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్ విలేకరులకు పంపిన ప్రకటనలలో వెల్లడించారు. ఏప్రిల్ 18న భద్రాచలం శివారు ప్రాంతంలో భద్రాచలం పోలీసులు, సిఆర్పిఎఫ్ జవాన్లు సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీలలో ఇద్దరు అనుమానితులను విచారించగా వారు నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ ఛత్తీస్గడ్ రాష్ట్రం, వెస్ట్ బస్తర్ దర్భ డివిజన్ ఏసీఎం, దుమాం ఎల్వో ఎస్ కమాండర్, మరొక స్త్రీ దుమాం ఎల్ ఓ ఎస్ డిప్యూటీ కమాండర్‌గా నిర్ధారణ అయినట్లు ఎస్పీ పేర్కొన్నారు. అరెస్ట్ అయిన కుంజం ఉంగల్ దుమాం ఎల్వోఎస్ కమాండర్ అని చత్తీస్గడ్ రాష్ట్రం, సుకుమా జిల్లా వెదిరా గ్రామమని, మూసికి రాజే, దుమాం ఎల్వో ఎస్ డిప్యూటీ కమాండర్ చత్తీస్గడ్ రాష్ట్రం దోళ రాజు గ్రామం అని పేర్కొన్నారు. మీరు 2008 నుంచి అనేక హింసాత్మక సంఘటనలో పాల్గొన్నారని తెలిపారు.