Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్మెన్‌కు మొరపెట్టుకున్న స్ధానికులు : జోక్యంతో నిలిపివేత
నవతెలంగాణ-ఇల్లందు
దశాబ్దుల కాలంగా సింగరేణి రా వాటర్ పైప్ లైన్‌కు కనెక్షన్ ఇచ్చుకొని నీటిని వినియోగిస్తున్న బైపాస్ పరిసర ప్రాంత ప్రజల పంపు కనెక్షన్లను సింగరేణి సిబ్బంది మంగళవారం తొలగించడానికి ప్రయత్నించారు. ఈద్గాను పరిశీలించి జెకెకు వెళుతున్న క్రమంలో బైపాస్కు ఆనుకొని నివసిస్తున్న మహిళలు చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర రావుని ఆపి వారి మొరపెట్టుకున్నారు. సమస్యను వివరించి న్యాయం చేయవలసిందిగా కోరారు. వెంటనే స్పందించి సింగరేణి అధికారులతో చేరవాణిలో మాట్లాడి బైపాస్ పరిసర ప్రాంత ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా పంపు కనెక్షన్లు సాధ్యమైనంత త్వరగా ఇప్పిస్తామని ప్రస్తుతం రా వాటర్ పైప్ లైన్‌కు ఉన్న పంపు కనెక్షన్లు తొలగించొద్దని చైర్మన్ కోరారు. సింగరేణి సంస్థ వారు సానుకూలంగా స్పందించి పంపు కనెక్షన్లు తిరిగి అమరిచారు. తమ సమస్యను చెప్పిన వెంటనే విని పరిష్కరించినందుకు చైర్మన్ స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.