Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
మండల పరిధిలోని గోపాలరావు పేట గ్రామంలో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవి శేఖర్ వర్మ, ఎంపీపీ గుమ్మడి గాంధీతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ గుమ్మడి గాంధీ మాట్లాడుతూ మండలంలో కొనుగోలు కేంద్రాలను పలుచోట్ల ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో దళారులకు ధాన్యం విక్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, సంఘం సీఈవో సునీల్, అగ్రికల్చర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు దాట్ల వాసుబాబు, గ్రామస్తులు, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.