Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోహిణి కార్తెని తలపిస్తున్న ఎండలు
- వడ గాలులతో జనం ఉక్కిరిబిక్కిరి
నవతెలంగాణ-మణుగూరు
భానుడి భగభగలకు మణుగూరు అగ్నిగుండంలా మారుతుంది. గత వారం రోజులుగా మండుతున్న ఎండలు, వడ గాలులతో ప్రజలు తెల్లడిల్లి పోతున్నారు. ఉపరితల గనుల కారణంగా మణుగూరులో 44 డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండగా మధ్యాV ా్నం నిప్పుల కొలిమి తలపిస్తుంది. సాయంత్రం ఏడు గంటల వరకు వేడి తీవ్రత తగ్గడం లేదు. అటు కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం 28 డిగ్రీలు దాటిపోయాయి. మధ్యాహ్నం ఎండ తీవ్రతకు భయపడి ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. మండే ఎండలతో చిరు వ్యాపారులు రోజువారి కూలీలు విలవిలలాడిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం ఏటూరు నాగారం రహదారిపై మధ్యాహ్నం వేళ వాహనాల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. ప్రధాన రహదారులపై జనసంచా రం లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. సోమవారం భారీగా పేరున ఉష్ణోగ్రతలకు వేడిగాలు తోడవడంతో భయాందోళనకు గురవుతున్నారు. సేద తీర్చుకునేందుకు శీతల పానీయాలను ప్రజలు ఆశ్రయిస్తున్నారు.
నిప్పుల కుంపటిలా ...
రోహిణి కార్తకు నెల రోజుల ముందే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మండలంలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు ఉపరితల గనుల ప్రాంతంలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతల నమోదు అవుతున్నాయని విధులు నిర్వహించలేకపోతున్నామని పని వేళలు మార్చాలని కార్మికులు కార్మిక సంఘాల కోరుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో పగటి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సాధారణ ఉష్ణోగ్రతల కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నవోదయాయి. గత వారం రోజుల నుండి అధిక ఉష్ణోగ్రత నమోదు అవుతున్నాయి.