Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - బోనకల్
మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా క్లినిక్‌ను జిల్లా అదనపు కలెక్టర్ మొగిలి స్నేహలత, జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ కౌంటర్లలో సిబ్బంది చేస్తున్న పనుల వివరాలను స్టాప్ నర్స్ కోడి రెక్కల భవానిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా సమస్యలు ఉన్న స్త్రీలను గుర్తించి వాళ్ళకి వైద్య పరీక్షలు చేయాలనీ, అనుమానితులను గవర్నమెంట్ హాస్పిటల్ ఖమ్మంకు పంపాలని వారు సూచించారు. ఇందుకు అవసరమైన సదుపాయాలను బోనకల్ గ్రామపంచాయతీ కార్యదర్శులు ఏర్పాటు చేయమని వారికి సూచించారు.సమస్యలు ఉన్న స్త్రీలను గుర్తించటం లో వైద్య సిబ్బంది ఎక్కువ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి వేముల స్రవంతి, ఎంపీడీవో బోడెపూడి వేణుమాధవ్, ఎంపిఓ వ్యాకరణం వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, ఏసిడిపిఓ వీరభద్రమ్మ, ఐకెపి ఎపిఎం యద్దనపూడి పద్మలత, హెల్త్ సూపర్వైజర్లు స్వర్ణ మారతమ్మ, ఎం.దానయ్య, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.