Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిసాన్ సెల్ మండల అధ్యక్షులు కొప్పుల గోవిందరావు
నవతెలంగాణ-చింతకాని
రోజురోజుకి మొక్కజొన్న ధర తగ్గుతున్న నేపద్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని కిసాన్ సెల్ మండల అధ్యక్షులు కొప్పుల గోవిందరావు డిమాండ్ చేశారు. మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో చింతకాని మాజీ సర్పంచ్ బండి సైదేశ్వరావు నివాసంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో కొప్పుల గోవిందరావు మాట్లాడుతూ మార్చి నెల మొదట్లో మొక్కజొన్న ధర 2200 నుంచి రోజు, రోజుకి మొక్కజొన్న ధర కింటాకు ఐదు వందల రూపాయలు తగ్గి రైతులు తీవ్ర నష్టపోతున్నందున ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 1950 రైతులకు రావటం లేదని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని కోరారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల మధిర నియోజకవర్గంలోని బోనకల్లు, చింతకాని, మండలాల్లో మొక్కజొన్న రైతులకు తీవ్ర నష్టం జరిగింది. బోనకల్ మండలానికి సీఎం కేసీఆర్ వచ్చి నియోజకవర్గంలో పంట నష్టం అంచనా వేసి నష్టపరిహారం అందిస్తామని చెప్పి నెల రోజులు అవుతున్నా ప్రభుత్వం నుంచి ఇంకా రైతులకు నష్ట పరిహారం అందలేదన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరరావు, పాతర్లపాడు ఎంపీటీసీ బొర్రా ప్రసాద్, చింతకాని యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బందెల నాగార్జున, బండి సైదేశ్వరావు, మల్లెల వెంకటేశ్వర్లు, మైనార్టీ సెల్ అధ్యక్షులు మజీద్,లగడపాటి జోగారావు, వడ్రనపు బాబురావు. తదితరులు పాల్గొన్నారు.