Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్బందులు పడ్డ వికలాంగులు
- సదరం క్యాంపులు సక్రమంగా నిర్వహించాలి
- సీఐటీయూ నేతలు మల్లూరు, కొలికపోగు
నవతెలంగాణ-సత్తుపల్లి
పట్టణంలోని కిరాణా మర్చంట్స్ ఆసోసియేషన్ ఫంక్షన్‌హాలులో మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన సదరం క్యాంపు 11:30 గంటలకు ప్రారంభమైంది. దీంతో క్యాంపులో పాల్గొనేందుకు వచ్చిన వికలాం గులు ఇబ్బందులకు గురయ్యారు. శిబిరానికి చేరకున్న సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్ర శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు కొలికపోగు సర్వేశ్వరరావు నిర్వాహకులను ఇదేమిటని ప్రశ్నించగా డాక్టర్లు ఓపీలు చూసుకుని రావాలని సిబ్బంది సమాధానమివ్వడంతో నాయకులు మీడియాకు సమాచారమిచ్చారు. అనంతరం నాయకులు మల్లూరు, కొలికపోగు మాట్లాడుతూ వేసవికాలం ఎవరైనా త్వరగా పనులు ముగించు కుని ఇంటికి చేరుకోవాలనుకుంటారని, అలాంటిది వికలాంగుల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం దారుణమన్నారు. 11:30 గంటలకు ప్రారంభమై సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చేటప్పటికి క్యాంపు ముగిసి దివ్యాంగులు ఇంటికి చేరకోవడానికి నానా ఇబ్బందులు పడ్దారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు గంటల జాప్యంలో అక్కడ ఉన్నవారికి తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కూడా పూర్తిస్థాయిలో కాకుండా మొక్కుబడిగా కల్పించి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. పైగా ఈ క్యాంపు మొదట ఖమ్మంలో జరగాల్సి ఉండగా స్లాట్ బుక్‌చేసుకున్న వారికి ఆదివారం రాత్రి సత్తుపల్లిలో క్యాంపు ఉన్నట్లు మెసేజ్‌లు పంపారని, అది కూడా అందరికీ పంపలేదని తెలిపారు. వికలాంగుల పట్ల నిర్లక్ష్యం తగదని, భవిష్యత్తులో క్యాంపులు నిర్వహించేప్పుడు సమయపాలన పాటించి, సక్రమంగా నిర్వహిం చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శరత్‌బాబు, శంకర్, దావీదు సుమారు 100 మంది దివ్యాంగులు పాల్గొన్నారు.