Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
ప్రముఖ బహుళజాతి కంపెనీ నోసియల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని ఎస్బీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్‌లో 36 మంది ఎంపికైనట్లు కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. ఈ డ్రైవ్‌లో భాగంగా మొదట 130 మంది విద్యార్థులు హాజరుకాగా 80 మంది విద్యార్థులు తదుపరి రౌండ్ గ్రూప్ డిస్కషన్‌కు ఎంపికైయ్యారని తెలిపారు. ఆర్థిక మాంద్యం ప్రభావం చూపుతున్న ప్రస్తుత పరిస్థితులలో కూడా అత్యధికంగా 10 లక్షల వార్షిక వేతనంతో 36 మంది విద్యార్థులు ఎంపికవడం హర్షించతగ్గ విషయమన్నారు. తమ విద్యార్థులు చూపిన ప్రతిభ పరిస్థితులను ఆకలింపు చేసుకున్న విధానం అభినందించదగినది అన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ జి. ధాత్రి మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి 220 ప్లేస్మెంట్ తో అగ్రస్థానంలో నిలిచారని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి. రాజ్ కుమార్ మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరంలో అత్యధిక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం ద్వారా విద్యార్థులు అధిక సంఖ్యలో ఉద్యోగాలు సాధించారన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ గంధం శ్రీనివాస రావు, ఎకడమిక్ డైరెక్టర్స్ ఎవివి.శివ ప్రసాద్. జి.ప్రవీణ్ కుమార్, జి.సుభాష్ చందర్, జె.రవీంద్రబాబు, టి.పి.ఒ.లు, యన్. సవిత, ఎ.మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.