Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్
నవతెలంగాణ-ఇల్లందు
ఎమ్మెల్సీ తాతా మధు మీద పొంగిలేటి శ్రీను అనుచర వర్గం మద్ది బేబీ స్వర్ణ కుమారి తప్పుడు ఆరోపణలు చేయడం రాజకీయ మంద బుద్ధికి నిదర్శనమని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించి, మాట్లాడారు. ఏవైతే అవాకులు చవాకులు పేలుతున్నావో మద్ది బేబీ స్వర్ణ కుమారి అసలు నీవు ఎక్కడి నుండి వచ్చావు నీ స్థాయి ఏమిటి అనే విషయాన్ని మరిచి మాట్లాడటం సరికాదని అన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏమి ఆశించి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. పార్టీలోకి చేరిన తర్వాత వేలకోట్ల రూపాయలతో అక్రమ సంపాదన కూడగట్టుకొని వాపును చూసి బలుపు అన్నట్లుగా ప్రగల్బాలు పలకడం సిగ్గుమాలిన చర్య అన్నారు. మరి నేడు అదే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేదుగా మారింది అనేది ఒకసారి ఆత్మ విమర్శన చేసుకుంటే అర్థమవుతుందన్నారు. సమావేశంలో మండల ఇంచార్జ్ యలమద్ది రవి, పట్టణ ఇంచార్జ్ సుధీర్ తోత్ల (బబ్లూ), ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, అధికార ప్రతినిధి కుంట నవాబు పాల్గొన్నారు.