Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండ్రుగొండ
తునికాకు బోనస్ వెంటనే విడుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పెద్దిని వేణు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో సమావేశంలో వ్యకాస మండల కార్యదర్శి పెద్దిని వేణు మాట్లాడుతూ వెంటనే ఫారెస్ట్, రేంజ్ అధికారులు స్పందించి తునికాకు కార్మికులకు బోనస్ చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసును ముట్టడిస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, రాయి రాజా, సభ్యులు గుర్రం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.