Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మంద నరసింహరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
వీఓఏల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విడనాడి, వారి సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మంద నరసింహరావు అన్నారు. స్థానిక బస్టాండ్ సెంటర్లోని చిల్డ్రన్స్న్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన సమ్మెశిబిరాన్ని ఆయన సదర్శించారు. వీఓఏల సమ్మె 4వ రోజుకు సమ్మెకు సంఘీభావం తెలిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమ్మె చేయడానికి ప్రభుత్వమే కారణమని అన్నారు. వీఓఏల సమస్యలు పరిష్కరించాలని, ఇప్పటికే అధికారులకు, ప్రభుత్వంకు విన్నవించినా స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. వీఓఏలకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, వీఓఏలను సేర్పు ఉద్యోగుల గుర్తించాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ట్యాబ్లు ఇవ్వాలని, ఆన్లైన్ రిపోర్ట్లు చేయమని గ్రేడింగ్ పద్ధతిని రద్దు చేయాలని వివోఏ జీతాలు విఓఏల ఎకౌంట్లోనే వేయాలని అభయ హస్తం డబ్బులు పొదుపు సంఘాలకు ఇవ్వాలని అర్హులైన వివోఏలను సీసీలుగా ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్, ఐద్వా పట్టణ కార్యదర్శి సందకూరి లక్ష్మి, విఓఏల సంఘం నాయకులు రేష్మతో, సుజతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండల విఓఏలు తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం ఐకేపీలో అనేక సంవత్సరాలుగా పని చేస్తున్న వీఓఏలను సెర్ఫ్ ఉగ్యోగులుగా గుర్తించి వారికి కనీస వేతనం రూ.26 వేలు అందజేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కారం పుల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ అనుబంద విఓఏల మండల సంఘం ఆద్వర్యంలో లకీëనగరం స్టేట్ బ్యాంకు ముందు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె గురువారం నాటికి నాల్గవ రోజుకు చేరుకుంది. వారు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఆయన మాట్లాడారు. సమ్మె శిబిరాన్ని సీఐటీయూ మండల కన్వీనర్ కొర్సా చిలకమ్మ, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ, రైతు సంఘం మండల అధ్యక్షులు మర్మం చంద్రయ్య, లక్ష్మీనగరం జిపి ఉపసర్పంచ్ గడ్ల రామ్మోహన్రెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా అద్యక్షులు భూపేంద్ర, యువజన సంఘం మండల అద్యక్షులు గుడ్ల సాయిరెడ్డి, బిఎస్పీ మండల అద్యక్షులు కంచర్ల సింహాద్రిలు శిబిరాన్ని సందర్శించి వీఓఏలకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఓఏల మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లు, కె.నాగరాజు, గుట్టయ్య, కుమారి, సడాలు, భద్రమ్మ, రమేష్, రేఖ, వెంకట్, లత, వెంకటలక్ష్మీ, రమణ, కృష్ణ కుమారి, తదితరులు పాల్గొన్నారు.