Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీని గద్దె దింపే వరకూ విశ్రమించేదే లేదు
- బీజేపీని సాగనంపేందుకే బీఆర్ఎస్తో దోస్తీ
- ముగింపు సభలో కూనంనేని
నవతెలంగాణ-కొత్తగూడెం
దేశ సమగ్రత, సమైఖ్యతకు విఘాతం కలిగించే బిజేపిని గద్దె దింపేందుకు ప్రజా స్వామిక లౌకిక శక్తులు ఏకం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ నెల 14వ తేదిన భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని చర్ల మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి నాడు ప్రారంభమైన ప్రజాపోరు యాత్ర భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గ కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో ముగిసింది. గురువారం ఉదయం రుద్రంపూర్ నుండి బయలు దేరిన ప్రజాపోరుయాత్ర ర్యాలీ రామవరం, విద్యానగర్, బాబూక్యాంపు, పోస్టాఫీస్ సెంటర్, భజనమందిరం, సూపర్ బజార్, గణేష్ టెంపుల్ మీదుగా సాగింది. అనంతరం సూపర్ బజార్ సెంటర్లో ముగింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ దేశంలో అధికారం చెలాయిస్తున్న బిజేపి ప్రభుత్వం ప్రజలను నయవంచన చేస్తోందన్నారు. దేశభక్తి పేరుతో అధికారంలోకి వచ్చి స్నేహ ప్రీతిని ప్రదర్శిస్తూ అదాని, అంబానీలకు దేశ సంపదను దోచి పెడుతున్నారని మండిపడ్డారు. అనంతరం జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా మాట్లాడుతూ సీఎం కేసిఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, గిరిజన, గిరిజనేతరులకు పోడు పట్టాలివ్వాలని, జిల్లాలో సాగునీటి వనురుల మరింత కల్పించాలని, అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని అన్నారు. ఆత్మీయ సమ్మేళనాలతో ఒరిగేదేమీ లేదన్నారు. వై.శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు బందెల నర్సయ్య, గుత్తుల సత్యనార ాయణ, కల్లూరి వెంకటేశ్వరరావు, మున్నా లక్ష్మి కుమారి, నరాటి ప్రసాద్, దుర్గరాశి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, చంద్రగిరి శ్రీనివాసరావు, సరెడ్డి పుల్లారెడ్డి, వై.భాస్కర్రావు, దమ్మాలపాటి శేషయ్య, జి.వీరస్వామి, వంగా వెంకట్, భూక్య దస్రు, కంచర్ల జమలయ్య, జి.నగేష్, జక్కుల రాములు, కొమారి హన్మంతరావు, సోందే కుటుంబారావు, భూక్య శ్రీనివాస్, పోలమూరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.