Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మర్ క్యాంప్ పోస్టర్ ఆవిష్కరణలో కలెక్టర్
నవతెలంగాణ-పాల్వంచ
పుస్తకాలకు అతీతంగా విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడమే సమ్మర్ క్యాంప్ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు. గురువారం ఐడిఓసిలోని కలెక్టర్ ఛాంబర్లో సాంఘిక సంక్షేమ శాఖ సమ్మర్ క్యాంప్ స్పార్క్ లెస్ గోడ పత్రిక ఆవిష్కరించి, మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సాంగిక సంక్షేమ విద్యాసంస్థల ఆధ్వర్యంలో 51 సెంటర్లలో స్పార్కిల్స్ సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. మణుగూరు టీఎస్ డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కళాశాలలో జరిగే ఈ సమ్మర్ క్యాంప్‌లో యాంకరింగ్ అండ్ పబ్లిక్ స్పీకింగ్, సాంస్క్రిట్ లాంగ్వేజ్, థియేటర్ ఆర్ట్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విభాగాలలో నిపుణులైన అధ్యాపకులచే ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ పోస్టర్ కార్యక్రమంలో ఎస్సి గురుకుల ఆర్సిఓ ప్రత్యూష, మణుగూరు టీఎస్ డబ్ల్యూఆర్ఎస్ పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ కీసర నాగేశ్వరరావు, అధ్యాపకులు పుల్లారావు, వీర కుమార్ తదితరులు పాల్గొన్నారు.