Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉచిత శిక్షణ తరగతుల ముగింపు సభలో జీఎం
నవతెలంగాణ-ఇల్లందు
జీవితంలో ఎంచుకున్న లక్ష్య సాధన కోసం మరింతగా కృషి చేయాలని జీఎం యం.షాలేము రాజు అన్నారు. ఏరియా సేవా సమితి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ ఎస్ఐ, కానిస్టేబుల్ రాత పరీక్ష కోసం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ తరగతులు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏరియా జీఎం మాట్లాడుతూ సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాదించాలని సూచించారు. శిక్షణా తరగతులకు ముందుకొచ్చిన ఉపాధ్యాయులను అభినందిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రంలో ఎలాంటి ఒత్తిళ్లకు లోనవవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో రక్షణ అధికారి పంజాల శ్రీనివాస్, డీజీయం (పర్సనల్) జీవి మోహన్ రావు, సీనియర్ పర్సనల్ అధికారులు జి.శ్రీహరి, కె.సాయి స్వరూప్, సివిల్(ఇ.ఇ)వెంకటేశం, గుర్తింపు సంఘ ఉపాధ్యక్షుడు ఎస్.రంగనాధ్, ఉపాధ్యాయులు బొద్దుల శ్రీనివాస్, సుధాకర్, అభ్యర్థులు పాల్గొన్నారు.