Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెగ్యులర్ ఎంఈఓ నియామకంపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా
- ముఖాముఖిలో అలుగుబెల్లి
నవతెలంగాణ-చర్ల
ఎంతోకాలంగా నిలిచిపోయిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపక ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం టీఎస్ యూటీఎఫ్ మండల కార్యదర్శి బాలకృష్ణ అధ్యక్షతన రైతు వేదికలో జరిగిన ఉపాధ్యాయు, అధ్యాపకులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తొలుత ఉపాధ్యాయులు తమ తమ సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా పాఠశాలలలో నియామకాలు లేకపోవడంతో నానా అవస్థలు గురికావాల్సి వస్తుందని, ఏకరూప దుస్తుల కుట్టుకూలీ రూ.50 కావడంతో ఏ ఒక్క టైలరు ముందుకు రావడం లేదని అయినప్పటికీ ఉన్నతాధికారులు తమపై ఒత్తిడి చేస్తున్నారని, మరుగుదొడ్ల సమస్య, మౌలిక సదుపాయాలు నానాటికీ క్షీణిస్తున్నాయని మహిళా ఉపాధ్యాయులు. సిపిఎస్ వద్దు. ఓపీఎస్ఏ కావాలంటూ ఉపాధ్యాయులు ముక్తకంఠంతో ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువెళ్లారు. 317 జీవో విడుదల చేసి ప్రభుత్వం ఉపాధ్యాయుల పాలిట యమపాసాలు కురిపిస్తుందని, విద్యా వాలంటరీలను నియమించకుండా పని భారంతో పాటు ఉపాధ్యాయులను గురి చేస్తుందని ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ దష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఎమ్మెల్సీ సమస్యలన్నిటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని, సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు సమిష్టిగా పోరాడాల్సి ఉంటుందని ఎమ్మెల్సీ అన్నారు. రెగ్యులర్ ఎంఈఓ కోసం సతవితాలా ప్రయత్నం చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాజు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కిషోర్ సింగ్, సి.కృష్ణ, ఉపాధ్యక్షులు వరలక్ష్మి, బి.మురళీమోహన్, కె.రాంబాబు, వెంకటేశ్వర్లు, ఏ.శ్రీనివాసరావు, ఏవీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు నూపా నాగేశ్వరావు, పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.