Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సన్మానించిన పారిశుధ్య కార్మికులు
నవతెలంగాణ-ఇల్లందు
కమిషనర్‌గా షేక్ అంకుషావలి పదవీ బాధ్యతలు స్వీకరించి యేడాదిలో అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఈ సందర్భంగా గురువారం మున్సిపల్ కార్మికులు సంతోషంగా కమిషనర్‌కు పూలమాలలు వేసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఇఫ్టూ అనుబంధం జిల్లా కోశాధికారి మాట్లశ్రీను, నాయిని కృష్ణ నరేంగుల సంపత్ ఎండి ఫయాజ్ మాట్లాడుతూ కమిషనర్ పీరియడ్‌లో కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారా మయ్యాయి అన్నారు. ఎన్ఎంఆర్ కార్మికుల పిఎఫ్ సమస్య రూ.45 లక్షలు కార్మికుల అకౌంట్లో జమ అయ్యాయి. ఈఎస్ఐ బకాయిలు రూ.12 లక్షలు కార్మికుల అకౌంట్లో జమ అయ్యాయన్నారు. జీవో నెంబర్ 60 ప్రకారం మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు 15,600 2022 ఆగస్టు నుండి చెల్లిస్తున్నారని గుర్తుచేశారు. ఇప్పటివరకు కార్మికుల జీతాలు బకాయిలు లేకుండా తారీకులు అటు ఇటు అయినా క్రమంతప్పకుండా వస్తున్నాయన్నారు ఈ కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి శానిటరీ ఎస్సై రాధాకృష్ణ, జవాన్లు మాట్ల లక్ష్మణ్, కళ్యాణ్, వెంకన్న, భారతి, ఉమా తదితరులు పాల్గొన్నారు.