Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివోఏల దీక్షకు సంఘీభావం తెలిపిన అలుగుబెల్లి
నవతెలంగాణ-చర్ల
సమాన పనికి సమాన వేతనం విధానంలో సెర్ప్‌లో విధులు నిర్వహిస్తున్న వివోఏల న్యాయమైన కోరికలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తీర్చాల్సిందేనని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మండలానికి వచ్చిన ఆయన వివోఏల నిరవధిక దీక్ష శిబిరంలో పాల్గొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ దీపికలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గౌరవ వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రూపాయలు 10 లక్షల జీవిత బీమా తో పాటు ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలని, గ్రామ సంఘం గ్రేడింగ్ తో సంబంధం లేకుండా నేరుగా వివోఏల ఖాతాలోనే గౌరవ వేతనాలు జమ చేయాలని మొదలైన గ్రామ దీపికల న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే తీర్చాడానికి నా వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. అనంతరం సీనియర్ ఉపాధ్యాయులు పరిటాల రమణారావు కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో టిఎస్ యూటిఎఫ్ రాష్ట్ర నాయకులు రాజు, జిల్లా నాయకులు బెండ బోయిన మురళి, మండల నాయకులు బాలకృష్ణ, రాంబాబు పద్మలత పుప్పాల నరసింహారావు ఈసం నరసింహారావు, హిమగిరి బాబు తదితరులు పాల్గొన్నారు.