Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుద్యోగ నిరసన దీక్షను విజయవంతం చేయాలి
- విలేకరుల సమావేశంలో మాజీ ఎంఎల్ఏ వేం నరేందర్ రెడ్డి
నవతెలంగాణ- ఖమ్మం
రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మానికి ఓ ప్రత్యేకత ఉందని, కాంగ్రెస్కు ఖమ్మం కంచుకోట అని, ఖమ్మం అంటేనే బీఆర్ఎస్ పార్టీకి వణుకు పుట్టాలని మాజీ శాసనసభ్యులు వేం నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క ఆధ్యర్యంలో నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని అన్నారు. ఈ నెల 24న ఖమ్మంలో నిరుద్యోగ నిరసన దీక్షను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ నిరసన దీక్షతో రాష్ట్ర ప్రభుత్వ వెన్నుల్లో వణుకు పుట్టాలని అన్నారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఖమ్మంలో ఇల్లందు క్రాస్ రోడ్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్, టీపీసీసీ ఉపాధ్యక్షులు పోట్ల నాగేశ్వరావు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనా రెడ్డి, టిపిసిసి సెక్రటరీ మానవతా రారు, పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరావు, మహ్మద్ జావేద్, పుచ్చకాయల వీరభద్రం, జిల్లా అనుబంద సంఘ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్, దొబ్బల సౌజన్య, బొడ్డు బొందయ్య, మొక్కా శేఖర్ గౌడ్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల, నగర కాంగ్రెస్ కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు నాయక్, పల్లెబోయిన చంద్రం, మిక్కినేని నరేందర్, ముస్తఫా, యడవల్లి కృష్ణ, రామసహాయం మాధవిరెడ్డి, యర్రం బాలగంగాధర్ తిలక్ పాల్గొన్నారు.