Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాపోరు యాత్రలో భాగం హేమంతరావు
- యాత్రకు సంఘీభావం తెలిపిన సీపీఐ(ఎం)
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
అచ్చేదిన్ ఆగయా అంటూ అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ గ్యాస్ పెట్రోల్ డీజిల్ నిత్యవసర వస్తువుల పెంపదలకు కారణమయ్యి దేశ ప్రజలకు సచ్చేదిన్ తీసుకొచ్చారని రాష్ట్ర రైతు సంఘం నాయకులు భాగం హేమంతరావు అన్నారు. బిజెపికి హటావో దేశ్ కి బచావో పేరుతో చేపట్టిన ఇంటింటికి ప్రజా పోరు యాత్రలో భాగంగా తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ, కొక్కిరేణి గ్రామాలలో 8వ రోజు సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు దంతాల బాలరాజు, సిపిఐ మండల అధ్యక్షుడు బత్తుల రాధాకృష్ణ ఆధ్వర్యంలో కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై భాగం హేమంతరావు ప్రజలకు వివరించారు. ఈ ప్రజాపోరు యాత్రకు తిరుమలాయపాలెం మండలంలోని ఎర్రగడ్డ, కొక్కిరేణి గ్రామాల బిఆర్ఎస్, సిపిఎం నాయకులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను తదితరులు పాల్గొన్నారు.