Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాదంలో ప్రజాస్వామ్యం
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దేశంలో లౌకిక తత్వాన్ని కాపాడవలసిన బాధ్యత అన్ని మతాల ప్రజలపై వుందని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం సీపీఎం వన్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక 23వ డివిజన్లో రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు నున్నా నాగేశ్వరరావు చేతుల మీద రంజాన్ తోపా అందజేశారు.ఈ సందర్భంగా నున్నా మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో మతోన్మాదం తీవ్రంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు బిజెపి సిద్ధాంతమే లౌకిక ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచే విధంగా వుందని ఆరోపించారు.మతాల మధ్య చిచ్చు పెట్టడం, దేశాన్ని తాకట్టు పెట్టడం ఈ రెండు పనులు మాత్రమే మోడీ ప్రభుత్వం చేస్తుంది అని ఆరోపించారు. ఈ దేశం తిరిగి బాగుపడాలంటే కచ్చితంగా మూడోవ సారి బీజేపీ అధికారంలోకి రానివ్వకుండా చూడవలసిన బాధ్యత ఈ దేశ ప్రజలపై వుందని తెలిపారు. అనంతరం ఈ రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు వై విక్రమ్, జబ్బర్, పిట్టల రవి, బేగం, దాసరి నాగేశ్వరరావు, బాగం అజితా, డాక్టర్ పిల్లలమర్రి సుబ్బారావు, సరస్వతి, పి. రవి, గౌస్, నర్సింగ్ కృష్ణారావు, కూరపాటి శ్రీను, సత్తార్, నాగరాజు, డినేష్, తదితరులు పాల్గొన్నారు.