Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం మొక్కజొన్నలు కొనుగోలు చేయాలి
- లాలాపురంలో రైతుల నిరసన
నవతెలంగాణ-కొణిజర్ల
రోజు రోజుకు మొక్కజొన్న ధర తగ్గిపోతుంది. నిన్న మొన్నటి వరకు 2300 రూపాయలు క్వింటాళ్లు ధర ఉంటే 1700 రూపాయలకు ప్రయివైట్ ట్రేడర్లు కొనుగోలు చేయడంతో మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం లాలాపురంలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, జిల్లా సహాయ కార్యదర్శి కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు మాట్లాడుతూ మార్చి నెల నుంచి రోజురోజుకి మొక్కజొన్న ధర తగ్గి 700 రూపాయలు పైగా రైతులు నష్టపోతున్నారు అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 1960 రైతులకు రావటం లేదు అని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేయాలి అని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం నాయకులు పారుపల్లి శ్రీనాధ్, గోపవరం సోసైటి డెరైక్టర్ సంక్రాంతి నర్సయ్య, సంక్రాంతి పురుషోత్తం, చింతనిప్పు రామారావు, పాషా, ప్రభాకరరావు,రాచ్చభంట్టి బద్రిన్న, మోదుగు వెంకటేశ్వరరావు, సిద్ధా, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.