Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -బోనకల్
మండల పరిధిలోని తూటికుంట్ల గ్రామంలో నాగపూర్ నుంచి అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే భూసేకరణ రీ సర్వేను ఈ నెల 24న జరిపిస్తామని ఆర్డీవో మల్లాది వెంకట రవీంద్రనాద్ తెలిపారు. స్థానిక రైతు వేదిక భవనంలో శుక్రవారం తూటికొండ గమానికి చెందిన భూ సేకరణ రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూటికుంట్ల రెవిన్యూ పరిధిలో 45.25 ఎకరాల భూమి హైవే కింద సేకరణకు గుర్తించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు తమకు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం భూములకు పరిహారం ఇచ్చేలా చూడాలని కోరారు. కొంత మంది రైతుల పేర్లు తప్పుగా నమోదు చేశారని వాటిని సరి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇరిగేషన్ కాలువలను తొలగించకుండా చూడాలని రైతులు కోరగా ఆర్డీవో కాలువలు తొలగించకుండా చూస్తామని హామీ ఇచ్చారు. తమ భూముల గుండా వెళ్లే రహదారి మార్గంలో రెండు వైపులా మూడు మీటర్ల చొప్పున ఖాళీ భూమిని వదిలేస్తే తమకు ఇబ్బంది లేకుండా ఉంటుందని రైతులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి తహసీల్దార్ సంగు శ్వేత, రైతుబందు మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్ రావు, గిర్థావర్లు గుగులోతు లక్ష్మణ్, జి సత్యనారాయణలు, గ్రీన్ ఫీల్డ్ హైవే అధికారులు, రైతులు పాల్గొన్నారు.