Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
రామనుజవరం కమ్యూనిటీ హాల్ నిర్మాణం సింగరేణి సేవా దృక్పథానికి నిదర్శనమని విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ అన్నారు. శుక్రవారం రామనుజవరం పంచాయతీ పరిధిలో ప్రజల సౌకర్యార్థం శ్రీరస్తు సింగరేణి కళాభవన్‌ను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ గోదావరి నది తీరాన పుష్కర ఘాట్ సమీపాన శివాలయానికి వచ్చే ప్రజల సౌకర్యార్థం 44 లక్షల సిఎస్ఆర్ కమ్యూనిటీ హాల్ నిర్మించామన్నారు. సిఎస్ఆర్ నిధులతో లక్షలాది రూపాయలు వెచ్చించటం సింగరేణి యజమాన్యం సామాజిక దృక్పదానికి గొప్ప నిదర్శనం ఈ శ్రీరస్తూ సింగరేణి కళా భవన్ అని ప్రశంసించారు. నూతన కమ్యూనిటీ హాల్‌ను కొండాయిగూడెం, రామానుజవరం పరిసర గ్రామాల ప్రజలు నూతన కమ్యూనిటీ హాల్‌ను సద్వినియోగ పరుచుకోవలసిందిగా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం విజయ కుమారి, జడ్పిటిసి పోశం నరసింహ రావు, సొసైటీ చైర్మన్ కుర్రి నాగేశ్వర రావు, ఎస్ఓటు జిఎం డి.లలిత్ కుమార్, ఏజీఎం (సివిల్) డి.వెంకటేశ్వర్లు, ఏరియా ఇంజినీర్ నర్సిరెడ్డి, డిజిఎం(పర్సనల్) ఎస్.రమేశ్, వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు, షబ్బీర్ ద్దీన్, శివాలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.