Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరకట్ట నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి
- పోలవరం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి
- సీపీఐ(ఎం) నియోజకవర్గ కన్వీనర్ మచ్చా
నవతెలంగాణ-భద్రాచలం
పోలవరం బ్యాక్ వాటర్ వలన భద్రాచలం, బూర్గంపాడు మండలాలలోని గ్రామాలు ముంపుకి గురి అవుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు సిడబ్ల్యుసి కూడా గుర్తించిందని సీపీఐ(ఎం) స్వాగతిస్తుందని భద్రాచలం నియోజిక వర్గ కన్వీనర్ మచ్చా వెంకటేశ్వర్లు తెలిపారు. పోలవరం బ్యాక్ వాటర్ వలన భద్రాచలం, బూర్గంపాడు గ్రామాలతో పాటు భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ము గూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం, పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం, బూర్గంపాడు మండలాలలో ప్రధాన గ్రామాలతో పాటు కుటుంబాలు, వ్యవసాయ సాగు భూములు కూడా మునిగిపోతాయని అటువంటి భూములను అన్నింటిని ఇప్పటికే అధికారులు వివిధ సందర్భాలలో సర్వేలు చేసి ఉన్నారని అట్టి భూములకు నష్ట పరిహారం ఇవ్వాలని సీపీఐ(ఎం) కోరుతుందన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ వలన ముంపుకు గురౌతున్నందున నిర్వాసిత కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, అలాగే తక్షణమే పునరావాసం గురించి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. జూన్ నెల ప్రారంభంతో మళ్లీ వర్షాలు, వరదలు వచ్చే ప్రమాదం ఉన్నందున భద్రాచలం, బూర్గంపాడుకు ఇరువైపులా కరకట్టను అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నదని, ఎటపాక నుండి నెల్లిపాక వరకు కరకట్ట నిర్మాణం పెంచాలని కోరారు. ముఖ్యంగా ఎటపాక నుండి భద్రాచలంలోని సుబాష్ నగర్ కాలనీ వరకు కరకట్టను బలిష్టం చేయాలని కోరారు. ఇప్పటికే కరకట్టపైన చెట్లు మొలిచి వృక్షాలుగా తయారైనందున కరకట్ట నెర్రెలు బారుతున్నాయని అటువంటి చెట్లను తొలగించి కరకట్టను మరింత పటిష్టం చేయాలని కోరారు. దీనితో పాటు వరదలు వచ్చినప్పుడే అధికా రులు హడావిడి చేయకుండా ప్రభు త్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కరకట్ట గుడి ఏరియా, అశోక నగర్ కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ, సుభాష్ నగర్ కాలనీ వద్ద ఉన్న కరకట్ట స్లూయీస్లకు మోటార్లను మరింత సమర్థ వంతమైన వాటిని ఉపయోగించి వరద పట్టణంలోకి రాకుండా చర్యలు తీసుకునే దానికోసం ఇప్పటినుండే అధికారులు ప్రభుత్వం సమాయత్తం కావాలని కోరారు. భద్రాచలం పట్టణంలో నివాసం ఉంటున్న ముంపు కాలనీలో అన్నింటిలో పునరావాస కేంద్రాలకు గ్రామ సభలు పెట్టి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ గురించి వివరించి ప్రజలకు న్యాయం చేయాలని మచ్చా కోరారు.