Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రిని కలిసిన కలెక్టర్, డీపీవో,కార్యదర్శి షర్మిల
నవతెలంగాణ-పాల్వంచ
ఆరోగ్య పంచాయతీ విభాగంలో ఎంపికైన చుంచుపల్లి మండలం గౌతంపూర్ గ్రామ పంచాయతీకి ఉత్తమ పంచాయతీగా జాతీయ స్థాయిలో పురస్కారం లభించిడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో సోమవారం జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సర్పంచ్ పొడియం సుజాత అవార్డు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్, జెడ్పీ సీఈఓ విద్యాలత, డీపీఓ రమాకాంత్, సర్పంచ్ సుజాత, పంచాయతీ కార్యదర్శి షర్మిల, ఎంపీఓ సత్యనారాయణ, శుక్రవారం వీడిఎస్ కాలనీలోని మంత్రి పువ్వాడ అజరు కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారికి శాలువాకప్పి సత్కరించారు. ఇలాంటి అరుదైన గౌరవం భద్రాద్రి జిల్లాకు దక్కడం ఇది రెండోసారి అని, జిల్లా కలెక్టర్ అనుదీప్ సారథ్యంలో గతంలో స్వచ్ఛ గ్రామీణ్కు జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు రావడంతో జిల్లాకు గర్వకారణం అన్నారు. తెలంగాణలో సంక్షేమ పథకాల అమలు, జరుగు తున్న అభివృద్ధి దేశానికి గీటురాయిగా నిలవ డంలంటిదన్నారు. నేడు ఉత్తమ పంచాయతీలో ఆరోగ్య పంచాయతీ విభాగంలో జిల్లా, రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చుకొని నేడు జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికై ప్రశంసలు అందుకున యంత్రాంగానికి అభినందనలు తెలిపారు.